విజయవాడను నాలుగు రోజులుగా వరదలతో అల్లాడించిన బుడమేరుకు మళ్లీ వరద తాకిడి పెరిగింది. మంగళవారం బుడమేరులో వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం రాగా ఈ రోజు ఎనిమిదిరెట్లు పెరిగింది. బుధవారం సాయంత్రానికి 8 వేల క్యూసెక్కులకు వరద చేరింది.
శుక్రవారం రాత్రి గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం 3 అడుగులుగా ఉంది. మొత్తం మూడు గండ్లు పడగా ప్రస్తుతం ఒకదానిని పూడ్చారు. మిగతా రెండింటిని పూడ్చాల్సి ఉంది. ఈ పనులను మంత్రులు నిమ్మల రామానాయుడు, నారా లోకేశ్ పర్యవేక్షిస్తున్నారు.
మరో వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏడు నుంచి 12 సెంటీమీటర్ల వాన పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.