ఏలూరు జిల్లాలోని కొల్లేరుకు వరద భారీగా పెరిగింది. రామిలేరు, బుడమేరు, తమ్మిలేరు నుంచి భారీగా వరద రావడంతో కొల్లేరు పొంగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా వరద ఉద్ధృతి కొనసాగుతోంది. మండవెల్లి పరిసర ప్రాంతాలతో పాటు కైకలూరు-ఏలూరు రోడ్డుపై వరద ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోనూ వాన పడుతోంది. దీంతో బుడమేరుకు మళ్ళీ వరద పెరిగే అవకాశం ఉంది.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం దగ్గర జల్లేరు వాగు పొంగి రహదారిపై ప్రవహిస్తోంది, దీంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. దీని ప్రభావంతో తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నాయి.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు