గోదావరి పరీవాహకప్రాంతాల్లో వానలు కురుస్తుండటంతో నదికి వరద పోటెత్తింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 39 అడుగులకు చేరింది. అర్ధరాత్రికి నీటిమట్టం 43 అడుగులకు చేరుకోవచ్చు అని అధికారులు అంచనా వేశారు. వరద ఇంకా పెరిగితే ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.
వరద నేపథ్యంలో అధికారులను భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా అధికారులకు సమాచారం ఇవ్వాలని, సహాయం కోసం కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేయాలని వివరించారు.