ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఖురాన్ ప్రతిని తగులబెట్టినందుకు ఇమ్రాన్ అనే వ్యక్తిని సెప్టెంబర్ 1న అరెస్ట్ చేసారు. జిల్లాలోని మొహల్లా గంజ్ సాదత్ నివాసి అయిన ఇమ్రాన్, ఖురాన్‌ను తగులబెడుతున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ఆ వీడియో స్థానిక ముస్లింలను ఆగ్రహానికి గురి చేసింది.
బులంద్‌షహర్‌లోని షికార్‌పూర్‌లో 24వ వార్డు కౌన్సిలర్ షహీద్ అనే వ్యక్తి ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా షికార్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో సెప్టెంబర్ 1న ఫిర్యాదు చేసాడు. ఇమ్రాన్ ఖురాన్‌ను తగులబెట్టాడనీ, ఇస్లాం మతం గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేసాడనీ ఫిర్యాదు చేసాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని మీద కఠినమైన చర్యలుతీసుకుంటామని హామీ ఇఛ్చారు. ఎఫ్ఐఆర్‌లో ఇమ్రాన్ ముస్లిముల మతపరమైన సెంటిమెంట్లను గాయపరిచినందుకు కేసు పెడుతున్నట్లుగా రాసారు.
ఇమ్రాన్ తన వీడియోలో ఇస్లాంను విమర్శించాడు. అది శాంతియుతమైన మతం కాదని, అలా అనుకునే ముస్లిములు పొరపడుతున్నారనీ చెప్పారు. అవిశ్వాసులపై హింసకు పాల్పడవచ్చని ఖురాన్ చెబుతుందని ఇమ్రాన్ స్పష్టం చేసాడు. తీన్ తలాక్, నిఖా హలాలా వంటి ఆచారాలను ప్రోత్సహిస్తుందని కూడా వివరించాడు. దానివల్లే మహిళలతో దుర్మార్గంగా ప్రవర్తించడం, చిన్నారి అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయడం వంటివి జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసాడు. అందుకే ఇస్లాంలో సమానత్వం లేదని, చిన్నపిల్లలను వేధించడం జరుగుతోందనీ వివరించాడు.
స్థానికంగా ప్రముఖుడైన స్వామి రామగిరి మహరాజ్ ప్రవచనాలను ఇమ్రాన్ సమర్ధించాడు. ‘‘మొహమ్మద్ ప్రవక్త తప్పుడు పనులను ప్రోత్సహించారు. నాకు ఇస్లాం పూర్తిగా తెలీదన్న మాట నిజమే. కానీ మౌలానాలు, ముఫ్తీలు సైతం చెప్పలేని ఇస్లాం తప్పులను తప్పులుగా చెప్పే ధైర్యం నాకుంది. నేను ఈ పుస్తకాన్ని తగులబెట్టేస్తున్నాను. ఈ మనుషులు బంగ్లాదేశ్‌లో హిందువుల మీద చేసిన అఘాయిత్యాలు కూడా తప్పే. బంగ్లాదేశీ హిందువులను రక్షించాలని కోరినందుకే స్వామి రామగిరి మహరాజ్ తల నరికేస్తామంటూ ఈ ముస్లిములు నినాదాలు చేస్తున్నారు. వీళ్ళు స్వామి రామగిరి మహరాజ్ చెప్పిన మాటల సందర్భాన్ని వదిలేసి, ఆయన దైవదూషణ చేసాడని నిందిస్తున్నారు. ఆ చర్యలన్నింటికీ నేను వ్యతిరేకం. నేను సనాతన ధర్మాన్ని ఆమోదిస్తున్నాను’’ అంటూ ఇమ్రాన్ తన వీడియోలో స్పష్టంగా చెప్పాడు.
యూపీ పోలీసులు ఈ ఘటన విషయంలో వేగంగా స్పందించారు, ఇమ్రాన్‌ను వెంటనే అరెస్ట్ చేసారు. ఇమ్రాన్ రక్తం కళ్ళచూడాల్సిందే అంటూ ఎగిరిన ముస్లిం మూక, అతని అరెస్ట్‌తో చల్లబడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో శాంతి నెలకొందని పోలీసులు వెల్లడించారు.