తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత కుటుంబాలను ఆదుకునేందుకు టాలీవుడ్ ముందుకొచ్చింది. పలువురు నటులు సాయం ప్రకటించారు. నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల సాయం ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి రూ. 50 లక్షలు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
నందమూరి కుటుంబానికి చెందిన మరో యువ హీరో ఎన్టీఆర్ కూడా రూ.కోటి సాయం ప్రకటించారు. సిద్ధూ జొన్నలగడ్డ రూ.30లక్షలు అందజేశారు. ఏపీ, తెలంగాణ సీఎం సహాయ నిధికి ఈ సాయాన్ని అందజేశారు. సిద్ధూ జొన్నలగడ్డ రూ.30లక్షలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు రూ.15 లక్షలు )చొప్పున అందజేశారు. విష్వక్సేన్ రూ.10లక్షలు సాయం అందజేశారు.
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ. ఐదు లక్షలు అందజేస్తానని చెప్పారు.