అస్సాంలోని బార్పేటలో ఫారినర్స్ ట్రైబ్యునల్, 28మందిని బంగ్లాదేశీయులుగా గుర్తించి, వారిని గోల్‌పరాలోని డిటెన్షన్ సెల్‌కు తరలించింది. వారిలో 9మంది మహిళలు, 19మంది పురుషులు ఉన్నారు. బార్పేట ఫారినర్స్ ట్రైబ్యునల్‌లో సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత వారిని విదేశీయులుగా గుర్తించారు. అంతకుముందు బార్పేట జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న ఆ విదేశీయులను మతియా డిటెన్షన్ క్యాంప్‌కు తరలించారు.
ట్రైబ్యునల్ ఆదేశాల ప్రకారం విదేశీయులను తరలించినట్లు బార్పేట ఎస్పి సుశాంత బిశ్వ శర్మ వెల్లడించారు. జిల్లాలో సెర్చ్ ఆపరేషన్లు, న్యాయ పరీక్షల అనంతరం వారిని విదేశీయులుగా ధ్రువీకరించినట్లు తెలిపారు. ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు, అక్రమంగా భారత్‌లోకి చొరబడిన ఆ 28మంది బంగ్లాదేశీయులనూ గోల్‌పరాలోని డిటెన్షన్ క్యాంప్‌కు తరలించారు.
చట్టం ప్రకారం విదేశీయులుగా పరిగణించేవారిని గుర్తించే క్రమంలో అస్సాం ప్రభుత్వం ఈ ఆపరేషన్ నిర్వహిస్తోంది. బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి అక్రమంగా చొరబడిపోయి, స్థానిక జనాభా సమతౌల్యతను వ్యూహాత్మకంగా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అటువంటి అక్రమ చొరబాట్లతో అస్సాం పలు సమస్యలు ఎదుర్కొంటోంది.
ఫారినర్స్ (ట్రైబ్యునల్) ఆర్డర్ 1964 ప్రకారం అస్సాంలో ఫారినర్స్ ట్రైబ్యునళ్ళు ఏర్పాటు చేసారు. అక్రమ చొరబాట్లకు సంబంధించిన కేసులను ఈ ట్రైబ్యునళ్ళు పరిష్కరిస్తుంటాయి. వాటి ప్రకారం విదేశీయులుగా గుర్తించిన వారిని డిటెన్షన్ క్యాంపులకు పంపించివేస్తారు లేదా బహిష్కరిస్తారు. గోల్‌పరాలోని మతియాలో అలాంటి డిటెన్షన్ క్యాంప్ ఉంది. తాజాగా పట్టుబడిన వారిని అక్కడికే తరలించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు