మహిళలపై దురాగతాలకు అంతే లేకుండా పోతోంది. భార్యపై ఓ అరాచకవాది ఏకంగా 72 మందితో 91 సార్లు అత్యాచారం చేయించాడు. ఈ ఘటన ప్రాన్సులో వెలుగుచూసింది. రాత్రి తినే ఆహారంలో భార్యకు డ్రగ్స్ కలిపి, మత్తులోకి వెళ్లాక ముందుగా ఏర్పాటు చేసుకున్న వారితో అత్యాచారం చేయించాడు. అత్యాచారం చేయించడంతోపాటు ఆ వీడియోలు చిత్రీకరించాడు. ఈ అరాచకం 2011 నుంచి 2020 మధ్యన జరిగింది. కేసు విచారణ జరుగుతోంది.
కొంత కాలం కిందట నిందితుడు ఓ షాపింగ్ కాంప్లెక్సులో మహిళల వీడియోలు రహస్యంగా చిత్రీకరిచడంతో సెక్యూరిటీ సిబ్బంది అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అనుమానం వచ్చిన పోలీసులు అతని మొబైల్, ల్యాప్ట్యాప్ పరికరాలు పరిశీలించగా అసలు ఘోరం వెలుగు చూసింది. బాధితురాలు కూడా ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై కేసు నమోదైంది.
కట్టుకున్న భార్యపై ఓ భర్త చేసిన దారుణం ఇప్పుడు ఐరోపాలో పెద్ద చర్చకు దారితీసింది. పదేళ్లపాటు తనకు తెలియకుండానే తనపై అత్యాచారం చేశారని బాధితురాలు వాపోయారు. ఇలాంటి దురాగతాలపై మహిళలకు అవగాహన పెంచాలని ఆమె సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి అరాచకాలు జరగకుండా బహిరంగ విచారణ జరిపించాలని బాధితురాలు డిమాండ్ చేశారు.