తమిళనాడులోని నీలగిరి జిల్లా పోలీసులు 27ఏళ్ళ ఇమ్రాన్‌ను, అతని కుటుంబసభ్యులు నలుగురిని అరెస్ట్ చేసారు. తన భార్యను హత్య చేసినందుకు ఇమ్రాన్, అతనికి సహకరించినందుకు కుటుంబ సభ్యులూ అరెస్టయ్యారు. జూన్ 24న ఇమ్రాన్ తన భార్యను సైనైడ్ కలిపిన కాఫీతో హతమార్చాడు. వరకట్నం కోసమే ఆ దారుణానికి పాల్పడ్డాడంటూ మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసారు.
నీలగిరి జిల్లా ఉదకమండలం (ఊటీ)లోని కండల్ ప్రాంతంలో ఎ ఆషికా పర్వీన్ అనే 22ఏళ్ళ యువతి జూన్ 24న అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయింది. 75రోజుల దర్యాప్తు తర్వాత పోలీసులు ఆమె భర్త జె ఇమ్రాన్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. ఇమ్రాన్ తండ్రి జె ఇమ్రాన్ సీనియర్, తల్లి జె యాస్మిన్, తమ్ముడు జె ముక్తార్, బంధువు 56ఏళ్ళ కలీఫ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఇమ్రాన్ ఆషికాలకు 2021 జులై 15న పెళ్ళయింది. వారికి రెండేళ్ళ సంతానం కూడా ఉంది. పెళ్ళయిన నాటినుంచే ఆమెను అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించేవారు. అత్తగారు యాస్మిన్, భర్త ఇమ్రాన్, మరిది ముక్తార్ ఒక స్థలం కొనాలని భావించి ఆషికాను రూ.20లక్షలు తేవాలంటూ వేధించేవారు. వన్నారపేట్టయ్లో ఉన్న తల్లిదండ్రులు అబ్దుల్ సమద్, నిలోఫర్ నిషాలకు ఆ విషయాలు చెప్పుకుని మృతురాలు బాధపడుతుండేది.
జూన్ 24న ఆషికా శవం తమ ఇంటి వంటగదిలో కనిపించింది. తెరిచిఉన్న ఆమె నోరు, ఇతర శరీరభాగాలను వైద్యపరీక్ష చేసినప్పుడు ఆషికా శరీరంలో సైనైడ్ విషయం జాడలు బైటపడ్డాయి. ఆషికా విషం కలిపిన కాఫీ తాగి చనిపోయిందంటూ భర్త ఇమ్రాన్ ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దాన్ని నమ్మని తల్లిదండ్రులు ఊటీ వెస్ట్ పోలీస్ స్టేషన్లో వెంటనే ఫిర్యాదు చేసారు.
శవపరీక్షలో ఆ మృతదేహంలో సైనైడ్ ఆనవాళ్ళు దొరికాయి. శవం మెడ, భుజాలు, ఎముకల మీద దెబ్బలు తగిలిన ఆనవాళ్ళు గుర్తించారు. పోలీసుల దర్యాప్తులో యాస్మిన్, ఆమె కొడుకులు ఏదో దుకాణం నుంచి సైనైడ్ కొన్నట్లు వెల్లడైంది. దాన్ని కాఫీలో కలిపి, ఆషికాతో బలవంతంగా తాగించారు.
ఆషికా హత్య కేసులో నిందితులను పట్టుకోడానికి పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పరిచారు. నిందితుడినీ, అతనికి సహకరించిన మరో నలుగురినీ అరెస్ట్ చేసారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆమె బంధుమిత్రులు ఆందోళన చేపట్టారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు