బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పటించాలని ఆ దేశ విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహిద్ హుస్సేన్ డిమాండ్ చేశారు. ఆమెపై ఇప్పటి వరకు 53 కేసులు నమోదయ్యాయని గుర్తుచేశారు. భారత్‌తో తమకు అనేక ఒప్పందాలు ఉన్నాయని, హసీనాను ఎలా రప్పించాలో తమకు తెలుసని చెప్పారు. భారత్‌ను ఎన్నిసార్లు కోరినా స్పందించడం లేదని ఆయన అన్నారు. హసీనా భారత్‌లో ఎక్కడుందో తెలుసా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు, ఆ విషయం భారత్‌ను అడగాలని తౌహిద్ అసహనం వ్యక్తం చేశారు.
రిజర్వేషన్ల చిచ్చు బంగ్లాదేశ్‌లో తీవ్ర హింసకు దారితీసిన సంగతి తెలిసిందే. గత నెల రోజుల్లో జరిగిన హింసతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆమె భారత్‌లో తలదాచుకుంటున్నారు. యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పటికీ అక్కడ రిజర్వేషన్ల అల్లర్లు అదుపులోకి రాలేదు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు