జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు తెగబడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఉగ్రమూకలు చెలరేగిపోతున్నాయి. అతి పెద్ద సుంజ్వాన్ ఆర్మీ బేస్‌పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల దాడులతో సైన్యం అప్రమత్తమైంది. బేస్ క్యాంపును సీజ్ చేశారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్ చేపట్టారు. అదనపు బలగాలను రప్పించారు. ఉగ్రదాడిలో సెంట్రీ జవాన్ గాయపడినట్లు తెలుస్తోంది. కాల్పులు కొనసాగుతున్నాయి.
జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను భగ్నం చేసేందుకు ఉగ్ర మూకలు కాల్పులకు తెగబడుతున్నాయని కేంద్ర హోం శాఖ ప్రకటించింది. ఉగ్రవాదుల ఏరివేతకు సైన్యంతోపాటు, ప్రత్యేక బలగాలు కూడా జల్లెడపడుతున్నాయి. అదనపు బలగాలను ఇప్పటికే జమ్మూ, కశ్మీర్‌కు తరలించారు.