ఆరేళ్లుగా రష్యా నిఘా తిమింగళంగా పేరుపడ్డ హ్వాల్దిమిర్ అనుమానాస్పదంగా చనిపోయింది. నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న తిమింగలం చనిపోవడం పెద్ద చర్చనీయాంశమైంది. 2019లో నార్వే సముద్ర తీరంలో మొదటిసారి కనిపించింది. ఆ తిమింగలం మెడలో సెయింట్ పీటర్స్ బర్గ్ ట్యాగ్ కనిపించడంతో ఇది రష్యా నిఘా వ్యవస్థకు చెందినదిగా వార్తల్లో కెక్కింది. తిమింగలం మృతిపట్ల
మెరైన్ మైండ్ వ్యవస్థాపకుడు, హ్వాల్దిమిర్ సంరక్షకుడు సెబాస్టియన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చాలా ఆరోగ్యంగా ఉన్న తిమింగలం ఎలా చనిపోయిందన్న దానిపై విచారణ జరుపుతున్నారు. హ్వాల్దిమిర్ నార్వే ప్రజల మనస్సులను గెలుచుకుందని ఆయన కొనియాడారు.
అయితే నిఘా తిమింగలం వార్తలను రష్యా ఖండించింది. తమకు ఎలాంటి నిఘా తిమింగలాలు లేవని ప్రకటించింది. సముద్రంలో నిఘాకు ఈ తిమింగలాన్ని ఉపయోగించారని, శత్రుదేశాల యుద్ద నౌకల కదలికలను కూడా రష్యాకు ఎప్పటికప్పుడు ఈ తిమింగలం ద్వారా అందేవనే ప్రచారం సాగింది.