ఆర్జి కర్ ఆసుపత్రి డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన మరవక ముందే బెంగాల్లో మరో ఘటన వెలుగు చూసింది. బీర్భమ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగి రాత్రి విధుల్లో ఉన్న నర్సు పట్లు అనుచితంగా వ్యవహరించాడని కేసు నమోదైంది. బీర్భమ్ సమీప గ్రామానికి చెందిన అబ్బాస్ వైరల్ ఫీవర్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. రాత్రి నర్సు వైద్యం చేస్తుండగా తాకరాని చోట తాకడం,
లైంగిక చర్యలో పాల్గొనాలంటూ మాట్లాడటంతో భయపడిన నర్సు వైద్యులకు ఫిర్యాదు చేసింది. వారు చెప్పినా రోగి వినకపోవడంతో, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్జీ కర్ ఆసుపత్రి మాజీ ప్రిన్సిపాల్ సంజయ్ ఘోష్‌కు పాలీగ్రాఫ్ పరీక్షలు పూర్తి చేశారు. లైడిటెక్టర్ పరీక్షలు కూడా నిర్వహించారు. సుప్రీంకోర్టు కేసును సుమోటాగా తీసుకుని దేశ వ్యాప్తంగా డాక్టర్ల రక్షణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది.