కుండపోత వానల కారణంగా హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. నాగర్‌కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం ఈగలపెంట పాతాళ గంగ మధ్య సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో ఘాటు రోడ్డులో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
హైదరాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్లొద్దని నాగర్‌కర్నూలు ఎస్పీ గైక్వాండ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కొట్రతండా వద్ద తెలంగాణ పోలీసులు ఓ చెక్‌పోస్టును కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్న ప్రయాణికులను మధ్యలోనే ఆపి వెనక్కి పంపుతున్నారు.