భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగడంతో పలు చోట్ల రైల్వే ట్రాకులు ధ్వంసం అయ్యాయి. దీంతో పలు సర్వీసులు రద్దు అయ్యాయి. మహబూబాబాద్ జిల్లా అయోధ్య గ్రామంలో చెరువు కట్ట తెగడంతో ట్రాకు ధ్వంసమైంది. దీంతో విజయవాడ-కాజీపేట మార్గంలో రైళ్ళు నిలిచిపోయాయి. ఇంటికన్నె-కేసముద్రం మధ్య మార్గంలో కంకర కొట్టుకుపోయింది. భారీగా వరద ప్రవహించడంతో ఆ మార్గంలో నడిచే రైళ్ళను సమీప స్టేషన్లలో నిలిపివేశారు.
విజయవాడ డివిజన్ పరిధిలో కూడా పలు రైళ్ళు నిలిచిపోయాయి. విజయవాడ- తెనాలి, విజయవాడ –గూడూరు, తెనాలి-రేపల్లె, విజయవాడ- కాకినాడ పోర్టు సర్వీసులు నేడు రద్దు అయ్యాయి. ఒంగోలు-విజయవాడ, విజయవాడ –మచిలీపట్నం, విజయవాడ-నర్సాపూర్ సర్వీసులు కూడా రద్దు అయినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ప్రయాణీకుల భద్రత దృష్ట్యా హెల్ప్ లైన్ నంబర్లను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది. విజయవాడ పరిధిలో వారు 7569305697 నంబరును సంప్రదించాలి. రాజమండ్రి- 08832420541, తెనాలి-08644227600, ఒంగోలు-7815909489, గుడివాడ-7815909462, గూడూరు-08624250795, భీమవరం టౌన్ -7815909402 నంబర్లను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది.