భారత మార్కెట్ లో మరో కొత్త మోడల్ బైక్ ను రాయల్ ఎన్ఫీల్డ్ ప్రవేశపెట్టింది. క్లాసిక్ 350 మోటారు సైకిల్ 2024 ను తీసుకొచ్చింది. హెరిటేజ్ (మద్రాస్ రెడ్, జోధ్పూర్ బ్లూ) వేరియంట్ ధర రూ. 1,99,500 కాగా, హెరిటేజ్ ప్రీమియం (మెడలియన్ బ్రాంజ్) ధర రూ. 2,04,000 గా నిర్ణయించింది. సిగ్నల్స్ (కమాండో శాండ్) ధర రూ. 2,16,000, డార్క్ (గన్ గ్రే, స్టెల్త్ బ్లాక్) ధర రూ. 2,25,000, క్రోమ్ (ఎమరాల్డ్ ) ధర రూ. 2,30,000గా ఉన్నట్లు రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ తెలిపింది. బైక్ బుకింగ్, టెస్ట్ రైడ్ లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.
ఎల్ఈడీ హెడ్ల్యాంప్, ఎల్ఈడీ పైలట్ ల్యాంప్, ఇన్స్ట్రమెంట్ క్లస్టర్ పొజిషన్ ఇండికేటర్, టైప్ సీ యూఎస్బీ చార్జింగ్ పోర్ట్ ను తీసుకొచ్చింది. నేటి నుంచి 4 వరకూ కొత్త క్లాసిక్ 350 బుక్ చేసుకునే వారికి అవకాశం కల్పించింది. వినియోగదారులు రాయల్ ఎన్ఫీల్డ్ తయారీ సౌకర్యాలను సందర్శించడానికి చెన్నైకి వెళ్ళే అవకాశం కూడా కల్పించింది.