వైద్య, పారామెడికల్ సిబ్బందికి ఆ శాఖ మంత్రి సత్యకుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆస్పత్రుల్లో విద్యుత్ సరఫరాకు అవరోధం లేకుండా చూసుకోవడంతో పాటు వరద నిల్వలేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అధికారులతో మాట్లాడి అవసరమైన చోటుకు వైద్య బృందాలను పంపాలని ఆదేశించారు.
ప్రసవతేదీల ఆధారంగా గర్భిణీలను సమీప ఆస్పత్రులకు తరలించాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అధికారులకు సూచించారు. రాష్ట్రస్థాయిలో ముగ్గురు సీనియర్ అధికారులతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపిన కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ హరి కిరణ్ సెప్టెంబ్ 3 వరకు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు తెలిపారు. బోదనాస్పత్రులకు సంబంధించిన కంట్రోల్ రూమ్ ను డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు ఆ విభాగ డైరెక్టర్ డీఎస్వీల్ నరసింహం తెలిపారు.