తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఉత్తర కోస్తా, యానం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని, చాలా చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
దక్షిణ కోస్తాలో మోస్తరు వర్షాలు పడతాయని అప్రమత్తం చేసింది. చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడతాయని పేర్కొంది. రాయలసీమ ప్రాంతంలోనూ ఇదే వాతావరణ పరిస్థితి ఉంది. అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయి.
ఎక్కువ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అయితే కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులకు ఎక్కువ అవకాశం ఉన్నాయి, ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం కీలక సూచనలు చేసింది. రానున్న ఆరు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలకు ఆస్కారముందని హెచ్చరించింది.