బిహార్‌లోని బెగుసరాయ్‌లో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్‌పై ఓ దుండగుడు దాడికి తెగబడ్డాడు. కేంద్రమంత్రి బల్లియా సబ్ డివిజన్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనగా షాజాద్ అలియాస్ సైఫీ అనే వ్యక్తి ఒక్కసారిగా మంత్రివైపు దూసుకువచ్చాడు. సెక్యూరిటీని తోసుకుంటూ వెళ్లి కేంద్రమంత్రిపై దాడికి యత్నించాడు. నిందితుడిని బల్లియా వాసిగా గుర్తించామని, అతను వార్డు కౌన్సిలర్ అని ఎస్పీ మనీష్ వెల్లడించారు.
ఘటనపై స్పందించిన కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, బెదిరింపులకు, దాడులకు తాను భయపడే రకం కాదన్నారు. తన పని తాను చేసుకుంటూ పోతానన్నారు. దాడి చేసిన వ్యక్తి వద్ద రివాల్వర్ ఉండి ఉంటే తనను చంపేసేవాడు కూడా అని ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి యత్నించి ఇష్టానుసారం మాట్లాడాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలో కించిత్ భయం కూడా లేదన్నారు. ఉన్నతాధికారుల సమక్షంలో దారుణంగా ప్రవర్తించాడన్నారు.