అసోజ్ అమావాస్య పండుగ సందర్భంగా హర్యానా శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం సవరించింది. పోలింగ్ తేదీని అక్టోబర్ 1నుంచి ఐదుకు మార్చింది. బిష్ణోయ్ కమ్యూనిటీ నుంచి అందిన వినతి మేరకు ఈసీ పోలింగ్ తేదీని మార్చింది. ఓట్ల లెక్కింపు తేదీని అక్టోబర్ 4నుంచి 8కి మార్చారు. జమ్ము కశ్మీర్ ఎన్నికలతో పాటు అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నారు.
బిష్ణోయ్ సమాజ మూలపురుషుడు గురు జంబేశ్వర్ స్మారకంగా అసోజ్ అమావాస్య పండుగను నిర్వహిస్తుంది. అక్టోబర్ 2న జరిగే ఈ వేడుకలో హర్యానాతో పాటు పంజాబ్, రాజస్థాన్‌కు చెందిన ఈ వర్గం ప్రజలకు పాల్గొంటారు.
పండగా కారణంగా బిష్ణోయ్ వర్గానికి చెందిన వారు ఓటు హక్కును కోల్పోకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వివరించింది. ప్రజాస్వామ్యంలో సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలన్న ఉద్దేశంతో పోలింగ్ తేదీలను మార్చినట్లు వెల్లడించింది.