దేశంలో కొత్తగా మరో మూడు వందే భారత్ రైళ్ళు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో ఈ మూడు రైలు సర్వీసులను ప్రారంభించారు. దీంతో నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్ళ సంఖ్య 54కు చేరింది. ఇప్పటికే 51 రైళ్ళు రాకపోకలు సాగిస్తున్నాయి.
నేడు పట్టాలెక్కిన మూడు సర్వీసులతో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతుంది. ఒక సర్వీసు మీరట్-లక్నో మార్గంలో నడువనుండగా, మరొకటి మధురై-బెంగళూరు మధ్య పరుగులు తీయనుంది. ఇంకొకటి చెన్నై-నాగర్‌కోయిల్ మార్గాల్లో రాకపోకలు సాగించనుంది. ఈ రైలు సర్వీసులు టికెట్ ధర ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించే సౌకర్యం ఉండటంతో ఆదరణ బాగా ఉంది.