రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను అరెస్ట్ భయం వెంటాడుతోంది. ఉక్రెయిన్ నుంచి పిల్లలను అక్రమంగా రష్యా తరలించాడనే ఆరోపణల నేపథ్యంలో యుధ్ద నేరాల కింద పుతిన్‌పై కేసు నమోదైంది. ఉక్రెయిన్ ఫిర్యాదు మేరకు అంతర్జాతీయ న్యాయస్థానం పుతిన్‌ను అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. త్వరలో పుతిన్ మంగోలియాలో పర్యటించబోతున్నారు. అయితే మంగోలియాలో పుతిన్‌ను అరెస్ట్ చేయాలంటూ ఉక్రెయిన్ మరోసారి ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
ఇప్పటికే పలు మార్లు పుతిన్ అరెస్ట్ కాబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే మంగోలియాతో రష్యాకు మంచి సంబంధాలున్నాయని, పుతిన్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు ఏ మాత్రం లేవని కొందరు కొట్టిపారేశారు. పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యాక విదేశాల పర్యటన తగ్గించారు. పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు రష్యాలో పర్యటిస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు