మంకీఫాక్స్ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో వందల సంఖ్యలో మరణాలు, వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. కాంగోలో ఇప్పటికే 18 వేల ఎం ఫాక్స్ కేసులు నమోదయ్యాయి. దాదాపు వెయ్యి మంది చనిపోయారు. బురుండి, కెన్యా, ఉగాండా దేశాలకు మంకీఫాక్స్ వేగంగా విస్తరిస్తోంది. దీన్ని అదుపు చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ రంగంలోకి దిగింది. కొద్ది రోజుల్లోనే 3 లక్షల వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకు రావాలని నిర్ణయించింది. పరిస్థితులను అదుపు చేసేందుకు ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది.
భారత్‌లో ఇప్పటి వరకు మంకీఫాక్స్ (mpox) కేసులు గుర్తించలేదు. విదేశాల నుంచి వస్తోన్న వారిపై కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు నిఘా వేశారు. వివిధ రాష్ట్రాలను హెచ్చరించారు. ముఖ్యంగా ఆఫ్రికా, అరబ్ దేశాల నుంచి వస్తోన్న ప్రయాణీకుల ఆరోగ్యంపై నిఘా పెంచారు. మంకీఫాక్స్ లక్షణాలు కనిపిస్తే వారిని ఐసోలేషన్‌లో పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. నోడల్ ఆసుపత్రులను గుర్తించారు. అన్ని రాష్ట్రాలు మంకీఫాక్స్ కేసుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.