అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో టిఇటి ఉపాధ్యాయినుల భద్రత, రక్షణ విషయమై బీజేపీ ఎమ్మెల్యే రమాకాంత దేవరీ తీవ్రమైన ఆరోపణలు చేసారు. జిల్లాలో ముస్లింలు ఎక్కువగా ఉన్న లహరీఘాట్ ప్రాంతంలో అస్సామీ హిందూ ఉపాధ్యాయినులపై ముస్లిములను పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని, ఆ ఒత్తిడులకు భయపడి కొందరు ఉపాధ్యాయినులు ముస్లిములను పెళ్ళి చేసుకున్నారనీ చెప్పారు. గురువారం అస్సాం అసెంబ్లీ సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక హిందూ యువతికి బలవంతంగా గోమాంసం తినిపించారని కూడా చెప్పుకొచ్చారు.
అస్సాం అసెంబ్లీలో గిరిజన ఎమ్మెల్యే అయిన రమాకాంత దేవరీ చెప్పిన విషయాలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాయి. శాసనసభలో ఎమ్మెల్యే ప్రసంగానికి అడుగడుగునా అడ్డుపడ్డాయి. అవన్నీ అబద్ధాలంటూ, ఆ ఆరోపణల మీద మెజస్టీరియల్ దర్యాప్తు జరిపించాలనీ ఏఐయూడీఎఫ్, కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేసాయి. అయినా రమాకాంత దేవరీ ఎంతమాత్రం ఆగలేదు. మోరిగావ్ జిల్లాలోని సున్నిత ప్రాంతాల్లో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్న హిందూ ఉపాధ్యాయినులకు బంగ్లాదేశీ ముస్లిం చొరబాటుదారుల నుంచి ముప్పు వాటిల్లుతోందని ఆయన వాపోయారు. జిల్లాలో ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి హిందూ మహిళా టీచర్లను త్వరగా బదిలీ చేయాలని విద్యాశాఖ మంత్రిని అర్ధించారు.
ప్రతిపక్షంలోని ముస్లిం ఎమ్మెల్యేల దురుసు వైఖరిని అధికార ఎన్డిఎ పక్షానికి చెందిన గిరిజన ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. దేశీయ హిందూ ఎమ్మెల్యేలను సభలో మాట్లాడకుండా అడ్డుకోవడం ప్రతిపక్షాలకు అలవాటైపోయిందంటూ వారిని విమర్శించారు. ముందు రాష్ట్రంలోని భూభాగాలను చొరబాటుదారులు ఆక్రమించుకుంటున్నారని, క్రమంగా వారు శాసనసభను సైతం ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని హిమంత బిశ్వ శర్మ ప్రతిపక్షాలను హెచ్చరించారు. అస్సాం స్థానిక తెగలకు చెందిన ప్రజల ఉనికి సంక్షోభంలో ఉందనీ, ఆ స్వదేశీ తెగల వారిని రక్షించుకోడానికే బిల్లు పాస్ చేసామని హిమంత చెప్పారు. ధుబ్రి, గోల్పరా, బార్పేట, దర్రాంగ్, నగావ్, మోరిగావ్ వంటి ప్రదేశాల్లో భూమిని కోల్పోయిన స్వదేశీ తెగలు అక్కడ తమ ఉనికి కోసం పోరాడాల్సిన దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేసారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు