పాదగయ క్షేత్రం పిఠాపురంలో శ్రావణ మాస ఆఖరి శుక్రవారం సందర్భంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరిగాయి. వత్రంలో పాల్గొన్న వారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చీరలు, పూజా సామగ్రి ఉచితంగా అందజేశారు.
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు సతీమణి పద్మజ, మహిళలకు పూజా కిట్ల ను అందజేశారు. దాదాపు 12 వేల పూజా కిట్లను పంపిణీ చేశారు. ప్రతీ కిట్ లో చీరతో పాటు పసుపు, కుంకుమ ఉన్నాయి. చేబ్రోలులోని జనసేన అధినేత పవన్ నివాసంలో ఈ కిట్లను ప్యాక్ చేశారు.
శ్రావణ శుక్రవారం కావడంతో ఉదయం 5 గంటల నుంచే పిఠాపురంలోని అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో మూడు విడతలుగా వ్రతాలు నిర్వహించారు.