కాణిపాకం వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 7 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాలపై దక్షిణాది రాష్ట్రాల అధికార భాషల్లో పోస్టర్లను ఆలయ పాలకమండలి విడుదల చేసింది. దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోస్టర్లను అమరావతిలోని సచివాలయంలో ఆవిష్కరించారు.
కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, పూతలపట్టు ఎమ్మెల్యే మురళి మొహన్, అదనపు కమిషనర్ రాంచంద్రమోహన్, కాణిపాకం దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాణి పాల్గొన్నారు.
వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయి. స్వామివారికి రోజుకో వాహన సేవ నిర్వహిస్తారు. సెప్టెంబర్ 27న తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ఆవిష్కరించారు.