భారత్ కు మరో అణు జలాంతర్గామి సమకూరింది. అరిహంత్ క్లాస్‌లో రెండోదైన ఐఎన్ఎస్ అరిఘాత్‌ను విశాఖ నేవల్ డాక్‌యార్డులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేవీలోకి ప్రవేశపెట్టారు.
అరిఘాత్ అణు జలాంతర్గామి పొడవు 111.6 మీటర్లు కాగా వెడల్పు 11 మీటర్లు. ఆరువేల టన్నులు బరువున్న ఈ అణు జలాంతర్గామి 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఉపరితలంలో గంటకు 22 నుంచి24 కిలోమీటర్లు (12–15 నాటికల్ మైళ్లు).. సాగర గర్భంలో గంటకు 24 నాటికల్ మైళ్ల సామర్థ్యంతో ప్రయాణిస్తుంది.
విశాఖలోని నేవీ షిప్ బిల్డింగ్ సెంటర్ సెన్సార్ సిస్టమ్ దీనిని తయారుచేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాలు అణుశక్తిని సముపార్జించుకుని మరింత బలోపేతం అయ్యాయన్నారు. వ్యూహాత్మక సమతుల్యత, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడంలో భారత్ కీలకంగా మారిందన్నారు.
దేశ భద్రత విషయంలో తమ ప్రభుత్వం మిషన్ మోడ్‌లో పనిచేస్తోందని చెప్పారు. అగ్ర రాజ్యాలతో సమానంగా భారత్ ను నిలబెట్టిన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రాజకీయ సంకల్పాన్ని దేశం ఎప్పటికీ మరవదన్నారు.