ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడింది. పాలస్తీనాలోని 640000 చిన్నారులకు వ్యాక్సినేషన్ వేసేందుకు ఇరు వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. పాలస్తీనాలో ఇటీవల పోలియో కేసులు వెలుగు చూడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై భీకరదాడులు ప్రారంభించిన తరవాత యుద్ధం మొదలైంది. హమాస్ ఉగ్రదాడిలో 1200 మంది ఇజ్రాయెలీలు, విదేశీ పౌరులు చనిపోయారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్దంలో ఇప్పటి వరకు 38వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఐరాస ప్రకటించింది. ఇటీవల హమాస్ కీలక ఉగ్ర నేతలను ఇజ్రాయెల్ మట్టుపెట్టడంతో, లెబనాన్‌కు చెందిన హెజ్బొల్లా కూడా యుద్ధానికి కాలు దువ్వింది. మూడు రోజుల విరామం తరవాత ఇజ్రాయెల్ హమాస్, హెజ్బొల్లా ఉగ్రవాదులపై దాడులు కొనసాగించే అవకాశముంది.