మరో అరాచకం వెలుగులోకి వచ్చింది. ముంబై నటి కాదంబరి జత్వానీపై అక్రమంగా కేసు పెట్టి 42 రోజులు విజయవాడ సబ్ జైల్లో ఉంచిన ఘటనపై డీజీపీ తిరుమలరావు విచారణకు ఆదేశించారు. ముఖ్యంగా ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారుల పాత్రపై దర్యాప్తు సాగుతోంది. అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా,మరో అధికారి విశాల్ గున్నీపై విచారణ నడుస్తోంది. ఇబ్రహీంపట్నం స్టేషన్లో జత్వానీపై నమోదైన కేసు వివరాలను విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు పరిశీలించి, డీజీపీకి నివేదిక సమర్పించారు. దీనిపై స్పందించిన డీజీపీ,కేసు విచారణకు ప్రత్యేక అధికారిని నియమించారు. ఏసీపీ స్రవంతి రాయ్‌ను విచారణ అధికారిగా నియమించారు.
ముంబై నటి జత్వానీ ఇవాళ విజయవాడ సీపీ కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వనున్నారు. ఆమె ఫిర్యాదును పరిశీలించి అధికారులు విచారణ చేపట్టనున్నారు. జందాల్పై జత్వానీ ముంబైలో పెట్టిన అత్యాచార కేసు ఉపసంహరించుకోవాలంటూ ఆమెపై ఏపీలో కేసుపెట్టి, హింసించిన ఘటనపై విచారణ సాగనుంది.