బంగ్లా భారత్ సరిహద్దుల్లో మరో దారుణం వెలుగు చూసింది. బంగ్లాదేశ్‌లోని అధికారం కోల్పోయిన మాజీ ప్రధాని హసీనా పార్టీకి చెందిన, అవామీలీగ్ నేత ఇషాకీ అలీఖాన్ పన్నా మేఘాలయలో విగతజీవిగా కనిపించాడు. మేఘాలయలోని జైంతియా కొండల్లో అవామీలీగ్ నేత ఇషాకీ అలీఖాన్ పన్నా మృతదేహాన్ని సరిహద్దు భద్రతా దళాలు గుర్తించాయి. గత కొంత కాలంగా ఈ నేత కనిపించడం లేదంటూ బంగ్లాదేశ్ మీడియా పలు కథనాలు ప్రచురించింది. పారిపోయే క్రమంగా సరిహద్దు దళాల చేతిలో పన్నా మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
బంగ్లాదేశ్‌లో రక్షణ లేకపోవడంతో పన్నా మేఘాలయ సరిహద్దులను అక్రమంగా దాటి భారత్ చేరుకునే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. శవం గుర్తుపట్టలేని విధంగా తయారైందని భారత సైన్యాధికారి ఒకరు తెలిపారు. ఆయన మృతదేహం వద్ద లభించిన పాస్‌పోర్టు ఆధారంగా పన్నాను గుర్తించారు.
ఈ నెల ఒకటి నుంచి బంగ్లాదేశ్‌లో చెలరేగిన రిజర్వేషన్ల హింసలో అక్కడ అవామీలీగ్ పార్టీ అధికారం కోల్పోయింది. ఆదేశ ప్రధాని హసీనా భారత్‌లో తలదాచుకుంటోంది. ఆ పార్టీ నేతలు కూడా రహస్య జీవితం గడుపుతున్నారు. కొందరు అవామీలీగ్ నేతలు బంగ్లాదేశ్‌లోని మారుమూల ప్రాంతాల్లో తలదాచుకుంటున్నట్లు తెలుస్తోంది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు