వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు రాజీనామా చేశారు. కాసేపటి కిందట ఇద్దరు ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు రాజీనామా పత్రాలు సమర్పించారు. తాను తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు మోపిదేవి వెంకట రమణ ఢిల్లీలో మీడియాకు చెప్పారు.బీద మస్తాన్రావు ఏ పార్టీలో చేరతారనేది తెలియాల్సిఉంది. ఇద్దరు ఎంపీలు వైసీపీకి కూడా రాజీనామా చేశారు.
వైసీపీ నుంచి మరో ఆరుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. వీరిలో కొందరు టీడీపీలోకి, మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నారు. వ్యాపారాలు ఉన్న వారు బీజేపీలోకి, మిగిలిన వారు టీడీపీలో చేరే అవకాశముందని సమాచారం. రాబోయే కొద్ది రోజుల్లోనే ఎవరెవరు రాజీనామా చేస్తారనే దానిపై స్పష్టత రానుంది.