దర్శి టీడీపీ ఇంచార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజాప్రతినిధిగా ఎన్నిక కానప్పటికీ అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నారనే నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు.
దర్శి ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు చేపట్టిన గొట్టిపాటి లక్ష్మి, సూపరింటెండెంట్ చైర్లో కూర్చొని వైద్యులు, ఇతర సిబ్బందితో మాట్లాడిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అర్హత లేకుండా అధికారం చెలాయించడం ఏంటని విపక్ష పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కూటమి సర్కార్ ఏర్పడినప్పటి నుంచి దర్శిలో గొట్టిపాటి లక్ష్మి, ఆమె బంధు వర్గం పెత్తనం చెలాయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి లక్ష్మి ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి అక్కడ విజయం సాధించారు. గొట్టిపాటి లక్ష్మి, ప్రస్తుత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు స్వయానా అన్న కూతురు.