ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా పరిధిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అబూజ్మడ్ అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచారం పై పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడ గాలింపు చర్యలు చేపట్టగా ఎదురుపడిన నక్సల్స్ కాల్పులు జరిపారు. ఆత్మరక్షణలో భాగంగా పోలీసులు కూడా కాల్పులకు దిగగా ముగ్గురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.
నక్సల్స్ హింస నుంచి 2026 మార్చినాటికి దేశానికి విముక్తి కల్పిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన యాంటీ నక్సల్ ఆపరేషన్స్ సమావేశం లో పాల్గొన్న అమిత్ షా, వామపక్ష తీవ్రవాదంపై అంతిమ దాడికి సమయం వచ్చిందన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థకు అతి పెద్ద సవాల్ నక్సలిజమన్నారు. నక్సలిజం కారణంగా నాలుగు దశాబ్దాల్లో 17,000 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.