ప్రేమోన్మాది దాడిలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన హైదరాబాద్ గోపన్‌పల్లి తండాలో చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపన తమాంగ్ కొంత కాలంగా గోపన్‌పల్లిలోని ఓ హాస్టల్లో ఉంటూ బ్యూటిషియన్‌గా పనిచేస్తోంది. కర్నాటకకు చెందిన రాకేశ్ కూడా గోపన్‌పల్లి తండాలో ఉంటూ పెళ్లి చేసుకోవాలంటూ దీపన వెంటపడుతున్నారు. ఆమె అందుకు నిరాకరించింది. సంవత్సరకాలంగా పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తోన్నట్లు దీపన స్నేహితులు చెబుతున్నారు.
పెళ్లికి నిరాకరించడంతో దీపనపై రాకేశ్ కత్తితో దాడి చేశారు. అడ్డుకోబోయిన వారిపై కూడా దాడి చేయడంతో వారికి కూడా గాయాలయ్యాయి. దాడి జరిగిన ప్రాంతంలోనే దీపన ప్రాణాలు కోల్పోయింది. దాడి తరవాత అక్కడ నుంచి పారిపోయిన రాకేశ్ గచ్చిబౌలి ప్రాంతంలో కరెంటు స్తంభం ఎక్కి ప్రాణాలు తీసుకునే ప్రయత్నం చేశాడు. విద్యుత్ షాక్ తగిలి గాయాలైన రాకేశ్‌ను పోలీసులు ( crime news )ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.