బంగ్లాదేశ్‌కు చెందిన భారత వ్యతిరేక మతతత్వ జమాతే ఇస్లామీ పార్టీపై ఆ దేశం నిషేధం ఎత్తివేసింది. ఈ నెల ఒకటో తేదీన బంగ్లాలో అల్లర్లు చెలరేగడంతో మాజీ ప్రధాని హసీనా నిషేధం విధించారు. తాజాగా బంగ్లాదేశ్‌లో యూనుస్ నేతృత్వంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం జమాతే ఇస్లామీపై నిషేధం తొలగించింది. రాజకీయ కారణాలతోనే జమాతే ఇస్లామీపై గత ప్రభుత్వం నిషేధం విధించిందని, దాన్ని తొలగిస్తున్నట్లు బంగ్లాదేశ్ న్యాయ వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ స్పష్టం చేశారు.
జమాతే ఇస్లామీ అధినేత షఫీకుర్ రహమాన్ సంచలన ప్రకటన చేశారు. భారతదేశంలో సత్సంబంధాలు కొనసాగిస్తామని చెబుతూనే, బంగ్లాదేశ్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. జమాతే ఇస్లామీ విద్యార్థి విభాగాలపై కూడా నిషేధం తొలగించారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు