తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీకి చెందిన ఎంపీ, వ్యాపారవేత్త ఎస్.జగత్రక్షకన్కు ఈడీ భారీ షాక్ విధించింది. జగతక్షకన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు రూ. 908 కోట్ల జరిమానా విధించింది.
విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26న వచ్చిన తీర్పుకు లోబడి ఈడీ చర్యలు ప్రారంభించింది.
ఫెమా చట్టంలోని 37ఏ సెక్షన్ అనుసరించి గతంలో సీజ్ చేసిన రూ. 89.19 కోట్లను కూడా జప్తు చేసినట్లు ఈడీ తెలిపింది. జగత్రక్షకన్ ప్రస్తుతం అరక్కోణం పార్లమెంట్ స్థానం నుంచి లోక్సభ సభ్యుడిగా ఉన్నారు.