వక్ఫ్ బోర్డు ఆస్తులపై పేదలకు హక్కు కల్పించే ప్రయత్నంలో భాగంగానే కొత్త చట్టం రూపకల్పనకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమైందని ఏపీ బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అన్నారు. ముస్లింలకు మేలు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఈ సవరణ బిల్లుపై ఎన్డీయే వ్యతిరేక శక్తులు గగ్గోలు పెట్టడం సరికాదన్నారు. ముస్లింల అభ్యున్నతే లక్ష్యంగా చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేయడం శుభపరిణామం అన్నారు.
వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఎన్డీయే ప్రభుత్వం కాపాడుతుందన్నారు. జన్ ధన్ ఖాతా, ముద్రా యోజన వంటి సంక్షేమ పథకాలలో ముస్లిం మహిళలకు లబ్ధి జరుగుతుందన్నారు. కొత్త చట్టంతో ప్రతీ పేద ముస్లింలకు వక్ఫ్ ఆస్తులపై హక్కు లభిస్తుందన్నారు. ట్రిపుల్ తలాక్ రద్దు నిర్ణయంతో ముస్లిం మహిళలకు న్యాయం జరిగిందన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో పేద ముస్లింలకు మేలు జరగలేదన్నారు. పెత్తందారులే వక్ఫ్ ఆస్తులను అనుభవించారని ఆరోపించారు.