వైసీపీని మరో కీలకనేత వీడారు. ఎమ్మెల్సీ పోతుల సునీత తన శాసనసమండలి సభ్యత్వంతో పాటు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా లేఖను శాసనమండలి చైర్మన్ కు పంపించారు. ఏ పార్టీలో చేరేది ఆమె తెలపలేదు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు.
పోతుల సునీత ఇప్పటివరకు వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఉన్నారు.
సునీత గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైసీపీ గెలిచిన తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అప్పట్లో కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వైసీపీ నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు.