ఉత్తర రైల్వేల పరిధిలోని లఖ్‌నవూ డివిజన్లో 8 రైల్వేస్టేషన్ల పేర్లు మారుస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సాధుసంతులు, స్వతంత్ర సమరయోధుల పేర్లు పెడుతున్నట్లు వెల్లడించారు.
కాశింపూర్ హాల్ట్ రైల్వేస్టేషన్‌కు జైస్ సిటీ రైల్వే స్టేషన్ అని పేరు మారుస్తారు. జైస్ స్టేషన్ పేరు గురు గోరఖ్‌నాథ్ ధామ్‌గా మారుతుంది. మిస్రౌలీ ఇకపై మా కాళికా ధామ్ అవుతుంది. బనీ స్టేషన్‌ను ఇకపై స్వామి పరమహంస్ స్టేషన్‌గా వ్యవహరిస్తారు.
అదే విధంగా, నిహాల్గఢ: రైల్వేస్టేషన్‌కు మహారాజా బిజిలీ పాసీ రైల్వేస్టేషన్ అని కొత్త పేరు పెపడతారు. అక్బర్గంజ్ ఇకపై మా అహోర్వా భవానీ ధామ్‌గా మారుతుంది. వార్సీగంజ్ పేరు అమర్షహీద్ భలేసుల్తాన్ అని మారుస్తారు. ఫుర్సత్గంజ్ స్టేషన్‌ను ఇకపై తపేశ్వరనాథ్ ధామ్ స్టేషన్ అని పిలుస్తారు.
యూపీలోని రైల్వేస్టేషన్లకు హిందూ వ్యతిరేక పేర్లను తొలగించాలని, వాటి బదులు స్థానిక సంస్కృతీ, వారసత్వాలను ప్రతిఫలించే పేర్లు పెట్టాలనీ కొద్దికాలం క్రితం అమేఠీ మాజీ ఎంపీ స్మృతీ ఇరానీ రైల్వేశాఖకు విజ్ఞప్తి చేసారు. ఆ మేరకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.