కునో నేషనల్ పార్క్ లో మరో చీతా మృతి చెందింది. నమీబియా నుంచి తీసుకొచ్చిన పవన్ (Pawan) అనే మగ చీతా మరణించినట్లు అధికారులు తెలిపారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన వాటిలో ఇది కూడా ఒకటి.
మంగళవారం ఉదయం 10:30 గంటల సమయంలో పొదల్లో ఎలాంటి కదలికలూ లేకుండా కనిపించిగా అధికారులు పరిశీలించారు. తలతో సహా సగం శరీరభాగం మొత్తం నీటిలో మునిగిపోయి ఉంది. శరీరంపై ఎలాంటి గాయాలూ లేవు దీంతో నీటిలో మునిగి చనిపోయిందని అధికారులు భావిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని పేర్కొననారు.
ఆగస్టులో కూనో పార్కులో ఇది రెండో చీతా మరణం. ఆఫ్రికన్ చీతా గామినికి జన్మించిన ఐదు నెలల చీతా కూన ఈ నెల 5న మృతి చెందింది. ప్రస్తుతం కూనో పార్క్లో 24 చీతాలు ఉన్నాయి. వాటిలో 12 పెద్దవి.
ప్రాజెక్ట్ చీతాలో భాగంగా.. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి రెండు దఫాలుగా భారత్కు చిరుతలు తీసుకొచ్చారు. వీటిని మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో పోషిస్తున్నారు. కొద్ది రోజులకే వివిధ కారణాలతో చీతాలు ఒక్కొక్కటిగా మరణించటం బాధ కలిగిస్తోంది.