కోల్‌కతాలో జూనియర్ వైద్యురాలిపై అఘాయిత్యం ఘటన, నిరసనలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. ఏ నాగరిక సమాజం కూడా తమ కుమార్తెలను, సోదరీమణులను బలి ఇవ్వదని ఆవేదన వ్యక్తం చేశారు. పీటీఐ సంస్థతో మాట్లాడిన ద్రౌపది ముర్ము,కోల్ కతా ఘటన తనను తీవ్రంగా కలచివేయడంతో పాటు భయాన్ని కలిగించిందన్నారు.
సమాజం ఆత్మపరిశీలన చేసుకోవడంతో పాటు కొన్ని కఠినమైన ప్రశ్నలు వేసుకోవాలని ఆమె అన్నారు. నిర్భయ ఘటన తర్వాత సమాజం ఎన్నో అత్యాచార ఘటనలను మరిచిపోయిందని, ఇలాంటి సామూహిక మతిమరుపు అసహ్యకరమైదని అభిప్రాయపడ్డారు.
గత తప్పులను ఎదుర్కొనేందుకు సమాజం భయపడుతోందన్నారు. కానీ ఇప్పుడు చరిత్రను సమూలంగా మార్చేందుకు సమయం ఆసన్నమైందన్నారు. ఈ సమస్యను సంపూర్ణంగా నిర్మూలించేందుకు ప్రయత్నిద్దామని పిలుపునిచ్చారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు