గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన రివర్స్ టెండరింగ్ పాలసీని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయించింది.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ జరిగింది.పాత పద్ధతిలోనే టెండరింగ్ కొనసాగిచాలని నిర్ణయించింది.
స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) ను రద్దు చేయాలని సమావేశంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పట్టాదారు పాసు పుస్తకాలపై జగన్ ఫొటో తొలగింపుతో పాటు సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు అనుమతించింది. వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని భేటీలో మంత్రివర్గం ఆమోదించింది.
ఆబ్కారీ శాఖ పునర్ వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపడంతో పాటు అలాగే పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణకు ఆమెద తెలిపింది.