భారతదేశంలోని హిందువులందరూ 26 ఆగస్టు కృష్ణాష్టమి పర్వదినం జరుపుకున్న రాత్రి, హైదరాబాద్ పాతబస్తీలో ఘోరం జరిగింది. సంతోష్‌నగర్‌లోని రక్షాపురంలో భూలక్ష్మీమాత ఆలయాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసారు. రాత్రి సుమారు 11.30కు కొందరు ఆగంతకులు మోటార్‌సైకిల్‌పై వచ్చి దాడికి పాల్పడి వెళ్ళిపోయారు. కొద్దిరోజుల్లో వినాయక చవితి వస్తున్న సమయంలో గణపతి నవరాత్రులకు ముందు ఆ ప్రాంతంలో మత సామరస్యానికి విఘాతం కలిగించేందుకే ఆ దాడి చేసారని స్థానికులు అనుమానిస్తున్నారు.
విషయం తెలిసిన వెంటనే విశ్వహిందూ పరిషద్, ఇతర హిందూ సంఘాల కార్యకర్తలు సహా పెద్దసంఖ్యలో హిందువులు అక్కడికి చేరుకున్నారు. తక్షణం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అక్కడే భజనలు, నినాదాలు చేసారు. రెండు శతాబ్దాల చరిత్ర గల ఆ దేవాలయంపై తరచూ దాడులు జరుగుతున్నాయని, ఇప్పటికే నాలుగు కేసులు పెట్టినా ఏ ఫలితమూ లేదని మండిపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారులు తెలియజేసారు.
అయితే, స్థానిక ప్రజల కథనం ప్రకారం…. స్థానిక ముస్లిం నాయకుడు ఇద్దరు వ్యక్తులను ఈ దాడికి బాధ్యులుగా చెబుతూ పోలీసులకు అప్పగించాడు. పోలీసులు సైతం ఆ ముస్లిం నాయకుడు చెప్పిన మాటలను కిమ్మనకుండా ఒప్పుకున్నారు. పైగా, ఆ ఇద్దరు నిందితుల్లో ఒక వ్యక్తి మతిస్థిమితం లేనివాడు. దాన్నిబట్టి, ఈ వ్యవహారం అంతా ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
విశ్వహిందూ పరిషత్ తెలంగాణ సంయుక్త కార్యదర్శి డాక్టర్ శశిధర్ ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. సంతోష్‌నగర్ ప్రాంతంలో డిఆర్‌డిఒ కార్యాలయం ఉంది. ఆ ప్రదేశంలో బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు అక్రమంగా చొరబడి నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. ఆ విదేశీ అక్రమ చొరబాటుదారులకు ఎఐఎంఐఎం పార్టీ అండదండలు అందిస్తోంది. వారి మనుగడ దేశ భద్రతకే ముప్పు కలిగించే ప్రమాదముంది. ఆ నేపథ్యంలోనే గుడిపై దాడి సంఘటనను చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు.
భూలక్ష్మి మాత ఆలయంపై దాడి ఎంఐఎం గూండాలే చేయించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో జరగబోయే గణపతి నవరాత్రులకు ముందు ఆ ప్రాంతంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే ఉద్దేశంతోనే ఈ దాడికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతం చాంద్రాయణగుట్ట నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అక్కడి ఎంఐఎం ఎంఎల్ఎ అక్బరుద్దీన్ ఒవైసీకి చెందిన గూండాలే దేవాలయాన్ని ధ్వంసం చేసి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు.
సంతోష్‌నగర్ ప్రాంతంలో సుమారు నాలుగు దశాబ్దాల క్రితం వరకూ హిందువులే మెజారిటీగా ఉండేవారు. మన దేశంలోకి అక్రమంగా చొరబడిన బంగ్లాదేశీ ముస్లిములు, రోహింగ్యాలు హైదరాబాద్‌లో ఆ ప్రాంతంలోనే నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో ఇప్పుడా ప్రదేశమంతా ముస్లిం ఆధిక్య ప్రాంతంగా మారిపోయింది.