ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోంది.మూడు రోజుల వ్యవధిలో దాదాపు 800 మంది విద్యార్థులు వివిధ రకాల సమస్యలతో ఆస్పత్రుల్లో చేరారు. మంగళవారం ఒక్కరోజే 342 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపునొప్పితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు.
విద్యార్థులు పెద్దసంఖ్యలో అస్వస్థతకు గురికావడంపై స్పందించిన నిర్వాహకులు కారణాలు తెలుసుకునేందుకు కమిటీ ఏర్పాటు చేశారు.
సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నందున ముందుజాగ్రత్తలు తీసుకోవడంలో యాజమాన్యం విఫలమైందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
విద్యార్థుల అస్వస్థతపై విచారం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేశ్,విద్యార్థులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.ఇలాంటి ఘటనలు
పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని హితువు పలికారు.