ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ జీవోలు మళ్ళీ అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీవోఐఆర్ వెబ్సైట్ ను పునరుద్ధరిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక నుంచి ప్రభుత్వ శాఖలు అన్ని ఉత్తర్వులను జీవోఐఆర్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని సాధారణ పరిపాలన శాఖ అధికారులకు స్పష్టం చేసింది. ఈ నెల 29 నుంచి అన్ని శాఖల జీవోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని తేల్చి చెప్పింది.
2021 ఆగస్టు 15 నుంచి గత వైసీపీ ప్రభుత్వం జీవోఐఆర్ ను నిలిపివేసింది.