డాక్టర్ హత్యాచార ఘటనను నిరసిస్తూ కోల్కతాలోని ఛాత్ర సమాజ్ విద్యార్థి సంఘం చేపట్టిన సచివాలయ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నబన్న మార్చ్ పేరుతో విద్యార్థులు సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చారు. నిరసనలకు అనుమతులు లేవని పోలీసులు, ఆరు అంచల భద్రత ఏర్పాటు చేశారు. 6 వేల మంది పోలీసులను మోహరించారు. అయినా విద్యార్ధులు కంచెను తొలగించుకుని సచివాలయ ముట్టడికి ముందుకు కదిలారు. నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.విద్యార్ధులు రాళ్లు రువ్వారు. పోలీసులు జలపిరంగులు కురిపించారు. పదుల సంఖ్యలో విద్యార్ధులు గాయపడ్డారు.
ముఖ్యంగా మూడు డిమాండ్లతో విద్యార్ధులు నిరసనకు దిగారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడం, నిందితుడికి శిక్ష వేయడం, సీఎం మమతా బెనర్జీ రాజీనామా ( bengal cm mamata benarji) చేయాలంటూ డిమాండ్ చేశారు. తమ విద్యార్థి సంఘానికి ఏ రాజకీయ పార్టీతోనూ సంబందం లేదని ఛాత్ర సమాజ్ నాయకులు ప్రకటించారు. ఈ నిరసనలో డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు పాల్గొనలేదు.