ఆర్జీ కర్ ఆసుపత్రి డాక్టర్‌పై హత్యాచారం ఘటన మరవకముందే మహారాష్ట్ర రత్నగిరి జిల్లాలో మరో ఘటన వెలుగు చూసింది. రత్నగిరికి చెందిన ఓ నర్సింగ్ విద్యార్ధిని కళాశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. కొంత దూరం వెళ్లాక ఆటో డ్రైవర్ ఇచ్చిన మంచినీరు తాగింది. తరవాత మత్తులోకి జారుకుంది. తాగే నీటిలో మత్తుమందు కలపడంతో విద్యార్థిని మత్తులోకి వెళ్లింది. వెంటనే ఆటో డ్రైవర్ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి లైంగికదాడికి తెగబడ్డాడు.
కొంత సేపటి తరవాత స్పృహలోకి వచ్చిన యువతి ఇంటికి చేరుకుని తల్లిదండ్రులకు విషయం చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. నర్సింగ్ విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడిని నిరసిస్తూ అర్థరాత్రి వరకు రత్నగిరిలో బాధితురాలికి మద్దతుగా కొందరు మహిళలు భారీ నిరసనలు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు.