ఛత్రపతి శివాజీ విగ్రహం కుప్పకూలింది. ఈ ఘటన మహారాష్ట్ర సింధ్దుర్గ్లో చోటు చేసుకుంది. గత ఏడాది ప్రధాని మోదీ ప్రారంభించిన శివాజీ విగ్రహం కూలిపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 35 అడుగుల ఈ భారీ విగ్రహాన్ని గత ఏడాది డిసెంబరు నాలుగున నౌకాదళ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఆవిష్కరించారు.
వారం రోజులుగా అతి భారీ వర్షాల వల్లే విగ్రహం కూలిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. పిడుగుపాటుకు గురైందా అనే కోణంలోనూ ఇంజనీర్లు విచారణ చేస్తున్నారు. ప్రచారం మీద ఉన్న ఆసక్తి, నాణ్యతపై లేకపోవడం వల్లే శివాజీ విగ్రహం కూలిపోయిందని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.