అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వేకోడూరు లక్ష్మి థియేటర్ భూ వివాదంలో కొల్లం గంగిరెడ్డి సెటిల్మెంట్లకు పాల్పడే ప్రయత్నం చేయడంతో పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు గంగిరెడ్డిని అరెస్ట్ చేసి విచారించి వదిలేశారు. తరవాత మరలా వివాదంలోకి రావడంతో జిల్లా ఎస్పీ గంగిరెడ్డిని అరెస్ట్ చేసి మదనపల్లె తరలించారు.
పుల్లంపేట మండలానికి చెందిన కొల్లం గంగిరెడ్డిపై (red sandle smuggler arrest) అనేక కేసులున్నాయి. ఎర్రచందనం విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేసిన కేసుల్లో నాలుగేళ్లపాటు జైలు జీవితం గడిపాడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జైలు నుంచి బయటకు వచ్చి ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడు.