సరిహద్దు దేశం పాకిస్థాన్‌లో వేర్పాటువాదులు చెలరేగిపోయారు. పాక్‌లోని వేర్పాటు వాద సంస్థ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన సాయుధులు ఆదివారం, సోమవారం జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు 39 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారంనాడు ముసాఖేల్ జిల్లా రరాషమ్‌లో పంజాబ్ నుంచి వస్తోన్న బస్సును ఆపి ప్రయాణీకులను కిందకు దింపి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 23 మంది మరణించారు. సోమవారం తెల్లవారుజామున కలత్ ప్రాంతంలో ఆరుగురు భద్రతా సిబ్బంది సహా మొత్తం 11 మందిని కాల్చి చంపారు.
బలూచిస్థాన్ గిరిజన నాయకులు నవాబ్ అక్బర్ ఖాన్ జయంతి సందర్భంగా ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. వేర్పాటువాద దాడులను పాక్ ప్రధాని షరీఫ్ ఖండించారు.గత కొంత కాలంగా పాక్‌లో వేర్పాటు వాదం బలం పుంజుకుంటోంది. తమ వద్ద పెద్ద ఎత్తున పన్నులు వసూలు చేస్తూ, ద్వితీయ పౌరులుగా చూస్తున్నారంటూ ఎల్‌ఓసీలోనూ వేర్పాటు వాదులు నిరసనలకు దిగుతున్నారు.