కృష్ణమ్మ మరోసారి పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ( srisailam flood gates lifted) పెరిగింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టుకు లక్షా 37 వేల క్యూసెక్కుల వరద చేరుతోంది. ఇప్పటికే ప్రాజెక్టులో 211 టీఎంసీల వరద నీరు ఉండటంతో వచ్చిన వరదను విద్యుత్ ఉత్పత్తి ద్వారా, 4 గేట్లు ఎత్తడం ద్వారా నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. కరెంటు ఉత్పత్తి ద్వారా 70 వేల క్యూసెక్కులు, గేట్లు ఎత్తి 37 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, భీమా లిప్ట్, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు 39 వేల క్యూసెక్కులు విడుదల చేశారు.
నాగార్జునసాగర్ నిండుకుండను తలపిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిగా నిండింది. ఎగువ నుంచి లక్ష క్యూసెక్కుల వరద చేరడంతో ఆరు గేట్లు ఎత్తి 70 వేల క్యూసెక్కుల వరదను పులిచింతలకు వదిలారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 30 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. పులిచింతల నుంచి 4 గేట్లు ఎత్తి 45 వేల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బరేజ్ నుంచి కాలువలకు 17600 క్యూసెక్కులు, గేట్లు ఎత్తి మరో 14 వేల క్యూసెక్కులు వదులుతున్నారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు